రాజన్న సిరిసిల్ల జిల్లా :

ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, ప్రచారాలపై మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఎంసిఎంసి బాధ్యులకు సూచించారు.
ఎంసీఎంసి సభ్యులు నిరంతరం వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర ప్రసారామాద్యామాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. ప్రకటనలకు సంబంధించి యం.సి.యం.సి అనుమతి పొందే విధంగా చూడాలన్నారు. ప్రకటనలకు అయ్యే ఖర్చులను పార్టీల ఖాతాలలో జమయ్యేలా చూడాలన్నారు.

కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం , జిల్లా కార్మిక అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్య నిర్వాహక సంచాలకులు డాక్టర్ వినోద్, cpo పిబీ శ్రీనివాస చారి, Ao రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights