ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్ Sampath P)):-

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీ పరీక్షల పురోగతి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్యను పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి లకు పంపాలని చెప్పారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా గుర్తించిన అనుమానిత క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారిని జిల్లా ఆసుపత్రి కి రిఫరల్ చేస్తూ ఖచ్చితంగా పరీక్షలు చేసుకునేలా మానిటర్ చేయాలన్నారు. అనుమానిత బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు.

డ్రై డే కార్యక్రమం తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో చేపట్టాలన్నారు. జ్వర బాధితులకు టెస్ట్ ల సంఖ్యను పెంచాలన్నారు.

డెంగ్యూ , మలేరియా, టైఫాయిడ్ కేసుల ను పూర్తిగా అరికట్టేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. హై రిస్క్ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు డ్రైడేను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు ప్రధానంగా నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు.

కిరణం కార్యక్రమం కింద ఫిజికల్ హెల్త్ తో సమానంగా మెంటల్ హెల్త్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీబీ బాధితులను గుర్తించడం, చికిత్స అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి జిల్లాలో మంజూరై పనులు అయ్యేలా చూడాలనీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను మిషన్ మోడ్ లో పూర్తి చేయాలన్నారు. లిఫ్ట్ ను త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్ఓ మినరల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలన్నారు.

సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీ ధర్ రావు, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రజిత, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights