రాజన్న సిరిసిల్ల పోలీస్…

మాధకద్రవ్యాల నిర్మూలన పైన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…..

మాధకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిలాల్లో మాధకద్రవ్యాల నిర్ములనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా జిల్లాలో విద్యార్థినీ, విద్యార్థులతో గత సంవత్సరం “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలతో పాటుగా, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు మాధకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, అవగాహనపై తేదీ :19-01-2024 (శుక్రవారం) రోజున చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు ఆయా మండల కేంద్రాల్లో సంబంధిత ఎస్.ఐ ల ఆధ్వర్యంలోనిర్వహించబడుతాయని తెలిపారు

ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు, బహమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులను 03 కేటగిరీలుగా విభజించడం జరిగింది.

1.2 to 5th Class
2.6th to 10th Class
3.Intermediate and Degree

కావున పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ పై పోటీలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేసి పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులను పోటీల్లో పాల్గొనడానికి భాగస్వామ్యం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights