జగిత్యాల

వార్తా పత్రికలు, న్యూస్ చానళ్ళు, సోషల్ మీడియాలలో వచ్చే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పరిశీలన చేయాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

శుక్రవారం IDOC లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని పరిశీలించి, MCMC సభ్యులకు అందిస్తున్న శిక్షణ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, MCMC సభ్యులు వార్తా పత్రికలు, న్యూస్ చానళ్ళు, సోషల్ మీడియా లలో వచ్చే వార్తలను పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థుల ప్రచార వార్తలను పరిశీలించి కమిటీకి చర్చించి చర్యలు తీసుకోవాలని, పేడ్ న్యూస్, వార్తలు పరిశీలన చేయాలని తెలిపారు.

Advertisements ల ప్రచురణకు ముందస్తు అనుమతి MCMC నుండి పొందవలసి ఉన్నదని తెలిపారు. అంతకు ముందు మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సమాచారాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, DPRO ఎన్.భీమ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ఎస్. శ్రీధర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, EDM మమత, రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ లు సుధీర్, పి.తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights