దావోస్‌లో కొనసాగుతున్న #WEF2024 లో భాగంగా లూయిస్ డ్రేఫస్ కంపెనీ (LDC) యొక్క వ్యాపార ప్రతినిధి బృందం, ఆ కంపెనీ  CEO మైఖేల్ గెల్చీ, CFO పాట్రిక్ ట్రూయర్, CSO థామస్ కౌట్‌ఆడియర్‌లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, IT మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు.

అనంతరం…

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ #WEF2024… 54వ వార్షిక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు.

గంటపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక రంగాల్లో #తెలంగాణ కోసం అనేక ఉత్తేజకరమైన వ్యాపార అవకాశాలను పొందుపరిచారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో సాంకేతిక, పారిశ్రామిక రంగాలను పటిష్టపరచడానికిగాను తమ వంతు సహకారం అందిస్తామని, తమ వ్యాపార అవకాశాలను విస్డ్రత పరుస్తామని ఈ సందర్భంగా ఆయా కంపెనీల సిఈఓ లు, ప్రతినిధులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు హామీ ఇచ్చారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights