‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు..’ ప్రధాని మోది

రానున్న ఐదు సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం:జగిత్యాల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోది  -అడుగడుగునా ప్రసంగం మధ్యలో మోడి మోడి అంటూ సభికుల నినాదాలు-నారీశక్తివందన్ పై మహిళల్లో ఉత్సాహం ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ప్రజలందరి ఆశీర్వాదంతో 400 సీట్లు గెలుచుకోబోతుందని… రానున్న ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని ప్రధానమంత్రి […]

శివ నామస్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం-వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో….(sampath panja): ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ పట్టణం శివ నామస్మరణతో  మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్. ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో […]

ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు

ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జగిత్యాలలో గురువారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో మూడు మీడియం (తేమీ,ఈమీ, ఊమీ)లలో విద్యార్థుల సంఖ్య- 301, బోధన బోధనేతర సిబ్బంది- 22, ఖాళీలు ఏడు, మొత్తం- 29 పోస్టులు ఉన్నాయని వివరించారు. […]

సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి!

హైదరాబాద్‌: గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది., గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు […]

ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ

ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు. స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాజాత బృందం తమ […]

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా #InvestInTelangana క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభం

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి […]

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ (మంథని) : sircilla srinivas: తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సంక్షేమంతో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలనీ… ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటల వెలుగులు అందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మకర సంక్రాంతి సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని […]

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలురామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, […]

శిక్షణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు (ఐపిఎస్ 2022 బ్యాచ్) రాహుల్ రెడ్డి

ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్. ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్ 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డి ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వద్ద రిపోర్ట్ చేశారు. 2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు […]

శుభోదయం…Siri

శుభోదయం…Siri…. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు, పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే, కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి, ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు… నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు, మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు, విలువ లేని వారితో వాదించటం, […]

Verified by MonsterInsights