హైదరాబాద్ :

డాక్టర్ సాజిదా ఖాన్ 2023 సేవారత్న అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందుకున్నారు.

భారతరత్న మదర్ థెరిసా 113 జయంతి వేడుకలలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో  సేవా రత్న అవార్డులు ప్రదానం కార్యక్రమంను మదర్ ఫౌండేషన్ సంస్థ వారు నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తొలి మహిళా ఆడియో ఇంజనీయర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్ 2023 సంవత్సరం సేవారత్న అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందుకున్నారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా TSIDC చైర్మన్ , మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణు గోపాలచారి, గౌరవ అతిథిగా IHRC డైరెక్టర్ సౌత్ ఇండియా & సీనియర్ అడ్వకేట్ “మ్యాన్ ఆఫ్ ది గాడ్ అవార్డు గ్రహీత” డాక్టర్ ఎ వి స్వామి,

కన్సల్టెంట్ ఫిజిషియన్, సోషల్ రిఫార్మర్ & పొలిటికల్ అనలిస్ట్ డా. ఆశిష్ చౌహాన్ మరియు సేల్స్ సపోర్ట్ మేనేజర్, శ్రీ నిధి సెక్యూర్ ప్రింట్ ప్రైవేట్. Ltd.కంజర్ల ఈశ్వర్ చారి తో పాటుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకెనపల్లి మల్లికార్జున్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రాఘవ, సాయినాథ్, & ఆర్. సాయి కుమార్ పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights