భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా 14న సోమవారం నుంచే గాంధీ చిత్ర ప్రదర్శన

-థియేటర్ లలో ఉచిత ప్రదర్శనకు సర్వం సన్నద్ధం

జగిత్యాల

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు జగిత్యాల జిల్లా లోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ బిఎస్ లత  ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ముగింపు  ఉత్సవాల సందర్బంగా దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేసే గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 14 వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శనను ప్రారంభించనున్నారు.  15 వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్బంగా, 20 వ తేదీన ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదు.. 16 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది. 

దియేటర్ ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీసు శాఖ, సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు గాంధీ చలన చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights