మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….

రాజన్న సిరిసిల్ల జిల్లా

ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 మంది మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు.

ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ నిర్మల యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.

బి ఆర్ ఎస్, ప్రభుత్వంలో ఎస్సై ఉద్యోగం కోసం టి ఎస్, పిఎస్ సి, ఎగ్జామ్ రాసిన ఈ ప్రభుత్వంలో ఉద్యోగం దక్కలేదని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నైన ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటు వేసి కే.మహేందర్ రెడ్డిని గెలిపిస్తామని వారు విలేకరుల సమావేశంలో అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మా పిల్లలు చదువుకున్నప్పటికీ.. ఉద్యోగాలు రాలేదని… నానా కష్టాలు పడి పిల్లలను చదివించుకుని ఇప్పుడు జాబ్ కోసం ఎదురుచూస్తూ దిక్కు తోచని స్థితిలో ఇంట్లో కూర్చొని ఎదురుచూస్తున్నారనీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దీటి. బాలయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు , జిల్లా ఉపాధ్యక్షులు కోమిరిషెట్టి తిరుపతి ఎస్.కె గౌస్, గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, బుచ్చి లింగు సంతోష్ గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి,పుల్లయ్య గారి తిరుపతి వీర్నపల్లి మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights