జగిత్యాల జిల్లా….రాయికల్ :(Reporter:S.Shyamsunder)

వార్షిక తనిఖీల్లో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్

– నూతన సాంకేతిక వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.

– రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు బేష్

ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి తెలుసుకొని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చునని అన్నారు.

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని.. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో 33 గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఈ సంవత్సరం 127 కేసులు నమోదయ్యాయని అన్నారు.

రాయికల్ పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని, పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ 15 నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు.

5s లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది యూనిఫామ్ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండాలని, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, సిబ్బంది సమస్యలు, పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.

పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని బాధితులు ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్కు వస్తే అందరికీ సమాన న్యాయం అందేలా చూడాలని, బాధితులు తీసుకు వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని సూచించారు.పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఫైల్స్ ను తనిఖీ నిర్వహించి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం అందించాలని సూచించారు.

పాత నేరస్తులపై నిఘ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతిరోజు GD ఎంట్రీ, సిబ్బందికి రోల్ కాల్స్ నిర్వహించాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు.

ప్రజలకు సీసీ కెమెరాల పై అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, అలాగే సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరగాలు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని తెలిపారు.

సెల్ ఫోన్లు పోయినప్పుడు దొంగతనానికి గురైనప్పుడు CEIR నూతన అప్లికేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రకాశ్, సి. ఐ అరిఫ్ అలీ ఖాన్,ఎస్సై అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights