రాజన్న సిరిసిల్ల : జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రయాణిస్తున్న కారుకు భోపాల్ సమీపంలో ఆక్సిడెంట్ – బెలూన్ తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా :

వేములవాడ

తిరుగు ప్రయాణం ఉజ్జయిని నుండి వేములవాడకు వస్తున్నప్పుడు భోపాల్ సమీపంలో బుధవారం ఉదయం 10. 30 కి సడెన్ గా డివైడర్ మధ్యనుండి పశువులు రావడంలో ప్రమాదం చోటు చేసుకుంది..ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు కు విషయం తెలియజేశారు.

దీంతో స్పందించిన ఆయన భోపాల్ లో వున్న బీజేపీ నాయకులకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. వెంటనే అక్కడి స్థానిక నాయకులకు సమాచారం అందించడంతో, వారు ప్రమాద స్థలికి చేరుకొని ప్రతాప రామకృష్ణ ను పరామర్శించడం జరిగింది. అదే సమయంలో సియార్ mla సుధాన్షు రాయ్ ప్రతాప రామకృష్ణ ను కలిసి, మరో వాహనం ఏర్పాటు చేశారు.

ఈ ప్రమాదంలో కారు బెలూన్ లు తెరుచుకోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదు.పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కారు ముందరి భాగం చాలా దెబ్బ తినడం జరిగింది. వెంటనే స్పందించిన మురళీధర్ రావు కు మరియు భోపాల్ బీజేపీ నాయకులకు mla సుధాన్షు రాయ్ కు కృతఙ్ఞతలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights