దాడి పై నిలదీస్తే అణచివేత ధోరణి..

బిజెపి నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైంది..

రామ మందిరం కోసం ఎల్ కె అద్వానీ కృషి..

మోడీ ఎం చేశారు..

నిరుపేదల ఖాతాలో 15 లక్షలు ఏవి..అని నిలదీత..

కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశం సుభిక్షం..

పార్లమెంట్ దాడి మోడీ నియంతృత్వ పోకడకు హెచ్చరిక..

పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..

పార్లమెంట్ ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ.. కాంగ్రెస్ నాయకుల నిరసన దీక్ష..

ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..కాంగ్రెస్ నాయకుల ర్యాలీ..

పార్లమెంట్ ఎంపీలను సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తల తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, తహసి ల్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ…

దేశ సమగ్రత కాపాడేందుకు ఇందిరా గాంధీ ప్రాణ త్యాగం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో స్మోక్ బాంబ్ దాడి దేశ భద్రత కు ఒక హెచ్చరిక చేశారు.

దాడి చేయడం పై నిరసన వ్యక్తం చేస్తే ప్రతిపక్ష సభ్యులను అకారణంగా సస్పెన్షన్ చేయడం దేశ చరిత్రలో నియంతృత్వ ధోరణి కి నిదర్శనం.

క్రూడాయిల్ 105 ఉన్నప్పుడు డీజిల్ 55, పెట్రోల్ 70 ఉంది.

క్రూడాయిల్ ధర 85 ఉంటే నేడు డీజిల్ 100 పెట్రోల్ 110 ఉంది.

యూపీ ఏ పాలనలో 55 లక్షల అప్పు ఉంటే పదేళ్ల కాలంలో 155 లక్షల కోట్ల అప్పులు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు

మోడీ చేసిన దేశ ప్రగతి అంబానీ, ఆదాని సంపదలు పదింతలు పెరిగింది.

ప్రతి పేదవాడి ఖాతా లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఎంతమందికి వేశారో చెప్పాలన్నారు.

ఎంతమందికి ఉపాధి చుపారో శ్వేతపత్రం విడుదల చేయండి..
యూపీ ఏ పాలనలో సోనియా గాంధీ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించాం.

అవినీతికి తావు లేకుండా సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ ది.

మోడీ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.

ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ.

భారత ఆహార సంస్థ ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధరలు కల్పించేందుకు

ఇందిరమ్మ పేరు చెబితే ఎందుకు జంకుతున్నారు.

భు సంస్కరణ చట్టం చేశారు.

22 లక్షల ఎకరాలకు నిరుపేదలకు హక్కు లు కల్పించి, ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది.

బిజెపి నాయకులు సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తూ..మత విద్వేసాలు రెచ్చగొడుతున్నారు.

దేశ శృంఖలాలు తేంచింది కాంగ్రెస్ పార్టీ.

దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రత కోసం ప్రాణాలు త్యాగం చేశారు.

ప్రపంచ శాంతి కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థాన్ మెడలు వంచింది ఇందిరా గాంధీ..

భారత దేశ ఖ్యాతి నీ అంతర్జాతీయ స్థాయి పెంచింది.

బిజెపి ఎం చేసిందో చెప్పాలి..అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు.

రాముడు సత్య నిష్టాపరుడు.. ధర్మ పాలకుడు..

ఎల్ కె అద్వానీ రథయాత్ర చేపట్టి రామ మందిర నిర్మాణము కోసం కృషి చేశారు.

ఎల్ కె అద్వానీ పేరు అయిన గుర్తు చేస్తున్నారా..మోడీ ఎం చేశారు అని నిలదీశారు.

భారత దేశ యువతకు ఉపాధి కల్పించనంత వరకు మోడీ కి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.

బిజెపి రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర ఎందుకు పెంచడం లేదు..

మద్దతు ధర అమలు చేయడం బాధ్యత లేదు అనడం ఏమిటి..

ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్దరణకు భారత్ ప్రజలు మెల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది..

రాష్ట్రంలోని నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడినట్లు కేంద్రంలో నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నం అయింది.

తెలంగాణలోని అన్ని లోకసభ సీట్లు గెలిపించుకోవాలని అన్నారు.

ఆరు గ్యారంటీ లతో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

మోడీ నిరుపేదల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామనీ, ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట మరిచారు.

ఎమ్మెల్యేగా గెలిపించారని, అందరికీ రుణ పడి ఉంటానని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఎంపీలను సస్పెన్షన్ చేయడం హేయమైన చర్య..

మతం పేరిట ప్రజలను బిజెపి విడదీసి,చిచ్చురేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights