కామారెడ్డి జిల్లా

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ బృందం

ఆసుపత్రిలో వసతులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న బీజేపీ నాయకులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ నాయకులు బృందం నేడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ….జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు చెప్పినట్టుగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉన్నాయా అని వీక్షించడానికి బీజేపీ బృందం నేడు ఆసుపత్రికి రావడం జరిగిందని అన్నారు. రోగులు, ఆసుపత్రి సిబ్బంది మరియు సాధారణ ప్రజలను అడిగి ఆసుపత్రి స్థితిగతులను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి ఆవరణ, వంటశాల, లాబ్, అన్ని గదులు, అత్యవసర విభాగం, ఇలా అన్ని విభాగాలను తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలు, వానకి ఉరుస్తున్న ఆసుపత్రి ఆవరణ ఇలా అన్ని తిరిగి సమస్యలు చూశామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights