గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
వెల్గటూర్ (జగిత్యాల)
జగిత్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాల మూలంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు వెల్గటూర్, ఎండపల్లి మండలాలలోని ప్రజలను అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది.
ప్రధానంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల పట్ల పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికార యంత్రాంగం సంయుక్తంగా ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
వెల్గటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆకుల సంజీవరావు, తహసిల్దార్ రమేష్, ఎండపల్లి తహసిల్దార్ ఉదయ్ కుమార్, మండల పంచాయత్ అధికారి జక్కుల శ్రీనివాస్, ఎస్ ఐ శ్వేత, రాజారాంపల్లి సర్పంచి శేఖర్, పంచాయత్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కోటిలింగాల సర్పంచి రవితేజలు గురువారం వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు చెందిన స్తంబంపల్లి, పాశిగాం, కోటిలింగాల, మొక్కట్రావుపేట, ముత్త్నూరు, రాంనూర్, తాళ్లకొత్తపేట, సెగ్యాం గ్రామాల్లో పర్యటించి, వర్షాలు, వరద ప్రభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే, సెగ్యాం కు చెందిన 15 కుటుంబాలను అక్కడి జడ్పీ హైస్కూల్ కు తరలించారు. అలాగే, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ ఆధ్వర్యంలో శానిటేషన్, బ్లీచింగ్ చేయడంతో పాటుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సన్నధ్దమవుతున్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.